![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి వచ్చిన తాజా హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'. ఆగస్టు 7 న విడుదలవ్వగా హిట్ టాక్ తో నేటికీ థియేటర్స్ లో తన సత్తా చాటుతూ ఉంది .వినూత్నమైన కాన్సెప్ట్, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌కు కొరియన్ కల్చర్, హారర్ మరియు ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు మేర్లపాక గాంధీ మలచిన తీరు ఒక రేంజ్ అని చెప్పవచ్చు. ఓటిటి రిలీజ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
థియేటర్ రిలీజ్ అయిన 4 నుంచి 6 వారాల విండో పీరియడ్ తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కురిందని, వినాయక చవితి పండుగ కానుకగా సెప్టెంబర్ 10 లేదా సెప్టెంబర్ 11వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 4నే వచ్చే అవకాశం ఉందనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.అయితే బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతుండటంతో సెప్టెంబర్ 11 తేదీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Also Read: సన్నీలియోన్ కి ముంబై కోర్టు శుభవార్త.. ఫ్యాన్స్ లో జోష్
రాయలసీమకి చెందిన కనకరాజు జీవితంలో కొరియా నుంచి వచ్చిన ఒక వింత వస్తువు మరియు అతీంద్రియ శక్తి ఎలాంటి గందరగోళం సృష్టించాయి అనేది కథాంశం. వరల్డ్ వైడ్‌గా 60 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లని సాధించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నడుస్తున్న కనకరాజుని నెట్‌ఫ్లిక్స్ సుమారు 26 కోట్ల భారీ డీల్ కి దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది.
korean Kanakaraju, Merlapaka Gandhi, Tollywood, TeluguCinema,TeluguNews,TeluguCinemaNews, TeluguOneDotCom
![]() |
![]() |