![]() |
![]() |

ప్రస్తుతం మన జీవితాల కోసం పోరాడుతున్నామనీ, మన మనసుకు దగ్గరైన సినిమా కోసం పోరాడలేమా? అని 'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి' సినిమాలు తీసిన దర్శకుడు పవన్ సాధినేని అంటున్నాడు. ప్రస్తుతం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు, హీరో సాయి శ్రీనివాస్ సోదరుడు గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికా నేపథ్యంలో కొంతభాగం కథ సాగుతుంది. కరోనా అమెరికాలో కరాళ నృత్యం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ షూటింగ్ చేయడం కష్టమే. ఈ నేపథ్యంలో కథ మార్చడానికి దర్శకుడితో పాటు నిర్మాతలు కూడా సుముఖంగా లేరు. ఆలస్యమైనా అమెరికాలోనే షూటింగ్ చేస్తామంటున్నారు.
"ఆల్రెడీ 40 పర్సంట్ షూటింగ్ చేశాం. మరో 40 పర్సంట్ ఇండియాలో, మిగతా 20 పర్సంట్ అమెరికాలో షూటింగ్ చేయాలి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ అయినప్పుడు ఇండియాలో తీయాల్సిన సన్నివేశాలు తీస్తాం. తర్వాత అమెరికా వెళతాం. మా నిర్మాతలకు తొందర ఏమీ లేదు. హిట్ సినిమా వాళ్ల చేతుల్లో ఉందని వాళ్లకు తెలుసు కాబట్టి. ఈ గ్యాప్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నాం. అలాగే, నేను కొత్త కథ రాస్తున్నా" అని పవన్ సాధినేని తెలిపారు.
![]() |
![]() |