![]() |
![]() |

తొలిరోజే ఇండ్రస్ట్రీ రికార్డుల్ని సవరించింది ఖైదీ నెం.150. చిరు రీ ఎంట్రీ ధాటికి బాహుబలి రికార్డుల్ని కూడా సవరించాల్సివచ్చింది. ఆ తరవాతి నుంచి చిరు ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. అతి తక్కువ రోజుల్లో వంద కోట్ల మైలు రాయిని అందుకొన్న తెలుగు చిత్రంగా ఖైదీ రికార్డు నెలకొల్పింది. చిరు 150వ చిత్రం కచ్చితంగా రూ.150 కోట్లు సాధిస్తుందని లెక్కలు వేశారంతా. అయితే ఆ అంకెల్నీ, అంచనాల్నీ దాటుకొంటూ వెళ్తోంది ఖైదీ చిత్రం. ఇప్పటికి వంద కోట్ల షేర్ అందుకొన్న చిరు సినిమా గ్రాస్ లెక్కల్లో ఎప్పుడో రూ.150 కోట్లు దాటేసింది. ఇప్పుడు రూ.200 కోట్లు కూడా సాధించడం ఖాయమని మెగా బ్రదర్ నాగబాబు జోస్యం చెబుతున్నారు.
లాంగ్ రన్‌లో ఖైదీ నెం.150 కచ్చితంగా రూ.200 కోట్ల గ్రాస్ సాధిస్తుందని, షేర్ లెక్కల్లో రూ.125 కోట్ల వరకూ తెచ్చుకొంటుందని నాగబాబు లెక్కగడుతున్నారు. సో.. చిరు నెక్ట్స్ టార్గెట్ రూ.200 కోట్లన్నమాట. ఇప్పటికే బాహుబలి తరువాతి స్థానంలో కొనసాగుతున్న శ్రీమంతుడు రికార్డుల్ని చెక్ పెట్టే దిశగా ముందుకు కదులుతోంది ఖైదీ నెం.150. ఈ జోరు ఇంకొన్ని రోజులు సాగితే.. రూ.200 కోట్ల గ్రాస్ అందుకోవడం అంత కష్టమేం కాకపోవొచ్చు. అయితే ఖైదీ నెం.150 వసూళ్లేంటన్నది అధికారికంగా ఇప్పటి వరకూ ప్రకటించలేదు. వంద కోట్ల గ్రాస్ తెచ్చుకొన్న సందర్భంగా అల్లు అరవింద్ ఓ ప్రెస్ మీట్ పెట్టారంతే. టోటల్ వసూళ్లు ఎంతన్న విషయంలో చరణ్ ఏమైనా అధికారిక ప్రకటన చేస్తే బాగుణ్ను. లేదంటే ఇవి కూడా ఫేక్ లెక్కలే అని ఇండ్రస్ట్రీ, నాన్ మెగా ఫ్యాన్స్ భావించే ప్రమాదం ఉంది.
![]() |
![]() |