![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న 'ఆచార్య' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. టీజర్ రిలీజైన కొద్దిసేపటికే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. మే 13న 'ఆచార్య'ను విడుదల చేస్తున్నట్లు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చిరంజీవి తెలియజేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆయన షేర్ చేశారు. అందులో ఆయన కుడిచేతికి ఎరుపు రంగు క్లాత్ కట్టుకొని కూర్చొని కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్‌లో తెల్లటి పంచెలను గోచీలాగా కట్టుకొని భుజాన కండువాలతో కొంతమంది యువకులు కనిపిస్తున్నారు. వారివంక చిరంజీవి ఓరగా చూస్తున్నారు. ఆ పోస్టర్‌కు #AcharyaOnMay13 అనే హ్యాష్‌ట్యాగ్ జోడించారు చిరు.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ధర్మస్థలి అనే ఓ పవిత్ర స్థలం, దానిలో ఉండే సాధువులు ప్రమాదంలో చిక్కుకోగా, వారిని రక్షించేందుకు ఆచార్య అనే వ్యక్తి వస్తాడని టీజర్ ద్వారా మనకు అర్థమవుతోంది. ఆచార్య అంటే ఎవరికో పాఠాలు చెప్పే గురువుగా ఆయన కనిపించడనీ, తప్పు చేసేవారికి గుణపాఠాలు చెప్తాడు కాబట్టి, జనం ఆయనను ఆ పేరుతో పిలుస్తుంటారని కూడా తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది.
మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా, తిరు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |