![]() |
![]() |
.png)
పవన్ కల్యాణ్ పుస్తక ప్రేమికుడన్న సంగతి అందరికీ తెలిసిందే. సెట్లో కాసేపు ఖాళీ దొరికితే చాలు... ఏదో ఓ పుస్తకం పట్టుకొని సెటిలైపోతాడు. పుస్తకాల ప్రభావం ఎంత ఉందో చెప్పడానికి పవన్ స్పీచ్‌లు వింటే సరిపోతుంది. తన ప్రతీ ప్రసంగంలోనూ... మహా రచయితల మాటల్ని కోడ్ చేస్తుంటాడు పవన్. ఇప్పటి వరకూ పవన్ వేయి పుస్తకాలైనా చదివి ఉంటాడట. తనని ప్రభావితం చేసిన పుస్తకాల గురించి పవన్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.
గాంధీజీ సత్యశోధన అంటే తనకు చాలా ఇష్టమట. పవన్ పదే పదే చదివిన పుస్తకాల్లో అదొకటి. యోగానంద రాసిన ఒక యోగి ఆత్మ కథ, శేషేంద్ర శర్మ రచించిన ఆధునిక మహా భారతం, మహేష్ భట్ పుస్తకం మైండ్ ఈజ్ ఏ మిత్.. పవన్‌కి ఇష్టమైన పుస్తకాలు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణమహర్షి, ఓషో, కృష్ణమూర్తి, బడేబాబా పుస్తకాలు పవన్‌ని చాలా చాలా ప్రభావితం చేశాయట. ఆ భావాలు, వాళ్ల ఆలోచనలు పవన్‌లో ప్రస్పుటంగా కనిపిస్తుంటాయి. బహుశా.. త్రివిక్రమ్‌తో పవన్ ఫ్రెండ్ షిప్ పెరగడానికి ఈ పుస్తకాలూ ఓ కారణం కావొచ్చు.
![]() |
![]() |