![]() |
![]() |
తాను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానినే అన్నారు టీవీ9 సీఈవో రవిప్రకాష్. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరుగుతున్న కాటమరాయుడు ప్రి-రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోషించి పాత్ర ఎంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని..ఆయన కాకుండా మరో వ్యక్తి అయితే ఫలితాల అనంతరం దానిని మరోక సంపాదనకు అవకాశంగా తీసుకునేవారన్నారు.
కాని ఇచ్చిన మాటకు కట్టుబడి, విమర్శలు ఎదురవుతున్నా ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు. రాజకీయాల్లో సరికొత్త విధానాలకు పవన్ నాంది పలికారన్నారు. ప్రస్తుత కాలంలో నిజం మాట్లాడటం..సత్యం వెనుక నిలబడటం చాలా కష్టమైన విషయమని అలాంటిది ఏపీకి ప్రత్యేక హోదా, నోట్ల రద్దు వంటి సున్నిత అంశాలపై పవన్ నిర్భయంగా ప్రశ్నించారన్నారు. రాబోయే కాలంలో ఆయన ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు రవిప్రకాశ్ తెలిపారు.
![]() |
![]() |