![]() |
![]() |
.jpg)
పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులకు తాను ప్రత్యక్ష సాక్షినన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఒకడు చెయ్యెత్తితే జనం అంతా ఆగిపోయే శక్తి దేవుడు ఒక్కడికే ఇస్తాడు, అలాంటి శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడో అందరికీ తెలుసు అనే సరికి ఆడిటోరియం అంతా పవన్..పవన్ అంటూ మార్మోగిపోయింది. ఒక్కమాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే..ఊరవతల మర్రి చెట్టులాంటి వాడని..ఎందుకంటే ఊరవతల ఏపుగా పెరిగిన మర్రిచెట్టు ఎండ నుంచి, వర్షం నుంచి కాపాడుతుంది. ఇంత చేస్తున్నా కనీసం గుర్తింపు కూడా కోరుకోదు. అదే పవన్ కళ్యాణ్ అని త్రివిక్రమ్ చెప్పాడు. ఆయన సాయం కొన్ని కోట్ల చేతుల సాయం..ఆయన సేవ మంచితనం ఇలాగే ముందుకు వెళ్లాలని త్రివిక్రమ్ ఆకాంక్షించారు.
![]() |
![]() |