![]() |
![]() |

కార్తీ, రష్మికా మందన్న జంటగా నటించిన 'సుల్తాన్' సినిమా తెలుగు వెర్షన్ ఫస్ట్ డే రూ. కోటి పైగా షేర్ సాధించింది. 'రెమో' ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 1.17 కోట్ల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో రూ. 42 లక్షలు, ఆంధ్రలో రూ. 58 లక్షలు, రాయలసీమలో రూ. 18 లక్షల షేర్ సాధించింది 'సుల్తాన్' మూవీ.
అంటే ప్రి బిజినెస్‌తో పోలిస్తే ఫస్ట్ డే ఈ సినిమాకు 19.5 శాతం రికవరీ అయ్యింది. 'సుల్తాన్' ప్రి బిజినెస్ వాల్యూ దాదాపు రూ. 6 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఫస్ట్ డే కలెక్షన్‌కు సంబంధించి కార్తీ సినిమాల్లో ఇది సెకండ్ హయ్యెస్ట్ కావడం గమనించదగ్గ విషయం. ఇదివరకు 'కాష్మోరా' మూవీకి ఫస్ట్ డే రూ. 2.15 షేర్ వచ్చింది.
మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో వీకెండ్ మంచి కలెక్షన్స్ వస్తాయని బయ్యర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ రోల్‌లో కార్తీ ప్రదర్శించిన నటన, రష్మిక గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్, వందమంది రక్తం తాగే కరకు రౌడీలను రైతులుగా మార్చడమనే కాన్సెప్ట్ ఆడియెన్స్‌కు నచ్చుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |