![]() |
![]() |

'శ్రీమంతుడు' సినిమా చేశాక.. ఆ సినిమాలో పాత్ర తరహాలోనే తన స్వస్థలం బుర్రిపాలెంను, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకొన్నారు. వాటి అభివృద్ధి పనులను చేపట్టారు. దత్తత అంటే ఏదో ఒక స్కూలు బిల్డింగ్‌తోనో, ఏవో ఒకట్రెండు రోడ్లు వేయించడంతోనో సరిపెడుతుంటారు కొంతమంది. కానీ మహేశ్ అలా కాకుండా, అన్ని విధాలా ఆ గ్రామాలను అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
తండ్రి పుట్టినరోజు (మే 31) సందర్భంగా బుర్రిపాలెంలోని ప్రజలందరికీ కొవిడ్-19 వాక్సిన్లు వేయించే బాధ్యతను తీసుకున్నారు. వాక్సిన్ పూర్తి డ్రైవ్‌ను ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో ఈ ఏడు రోజుల వాక్సినేషన్ డ్రైవ్‌ను మహేశ్ చేపట్టారు. తండ్రి పుట్టినరోజున ఆ డ్రైవ్‌ను ఆయన ప్రారంభింపజేశారు. ఇప్పటికే ఆంధ్ర హాస్పిటల్స్‌లో ఆయన వెయ్యి మందికి పైగా పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేయించి తన సహృదయతను ఆయన చాటుకున్నారు.
బుర్రిపాలెంలో కొవిడ్-19 వాక్సినేషన్ డ్రైవ్‌కు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో మహేశ్ షేర్ చేశారు. "మళ్లీ సాధారణ జీవితం రావడానికి వాక్సినేషన్ అనేది మన ఆశాకిరణం! బుర్రిపాలెంలో ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకొని, క్షేమంగా ఉండేందుకు నా వంతు పని చేస్తున్నా. ఈ వాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటుచేయడంలో మాకు సాయపడుతున్న ఆంధ్రా హాస్పిటల్స్‌కు రుణపడి ఉంటాను. ఇలాంటి క్లిష్ట కాలంలో దగ్గరుండి ఈ డ్రైవ్‌ను స్వచ్ఛందంగా పర్యవేక్షిస్తున్న మహేశ్‌బాబు అఫిషియల్ టీమ్‌కు ప్రత్యేక అభినందనలు. వాక్సిన్ ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకొని, తమ డోసు వేయించుకోవడానికి ముందుకు వస్తున్న గ్రామస్తులందరినీ నిజంగా మెచ్చుకోవాలి. వాక్సిన్ వేయించుకోండి. అందరూ క్షేమంగా ఉండండి." అని ఆయన రాసుకొచ్చారు.

![]() |
![]() |