Home  »  News  »  గోల్డెన్ ఛాన్స్: కల్కి 2 కాస్టింగ్ కాల్: ప్రభాస్ సినిమాటిక్ యూనివర్స్‌లో మీరు ఉండవచ్చు

Updated : Aug 10, 2026

 

సోషల్ మీడియాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు, మూవీ లవర్స్ , సినీ రంగంలో వివిధ రంగంలో స్థిర పడాలనే అనుకునే వారి వల్ల సైక్లోన్ తుపాన్ సంభవించింది. 


ప్రభాస్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ "కల్కి 2898 AD పార్ట్ 2 . పార్ట్ 1 లో ఉన్న ఎన్నో డౌట్స్ కి క్లారిఫై కూడా ఇస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆశగా పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల్లో ప్రభాస్ పై ఉండే క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు ఆ అభిమానులకి, సినిమాపై ఆసక్తి ఉన్న వాళ్ళకి కల్కి మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. 

కల్కి సినిమాటిక్ యూనివర్స్ (KCU) ను మరింత విస్తృతం చేసేందుకు వైజయంతీ మూవీస్ అధికారికంగా భారీ కాస్టింగ్ కాల్ (Casting Call) ప్రకటించింది. ఈ కాస్టింగ్ కాల్ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ నాగ్ అశ్విన్ టీమ్ మాత్రం ప్రతిభ కలిగిన కొత్త నటీనటులకు, డ్యాన్సర్లకు, మోడళ్లకు, మార్షల్ ఆర్ట్స్ నిపుణులకు ఏకంగా ప్రభాస్ నటించే భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లో అవకాశం కల్పించేందుకు డోర్స్  ఓపెన్ చేసింది. ఇందులో ఎలాంటి వయోపరిమితి లేకపోవడం విశేషం. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతిభ ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ప్రొఫైల్స్ పంపవచ్చని స్పష్టం చేశారు.  ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు స్పందనతో నెట్టింట సైక్లోన్ తుపాన్ మాదిరిగా పరిస్థితి ఉంది. దాదాపు వేలాది మంది ఔత్సాహిక కళాకారులు తమ ఆడిషన్ వీడియోలు, ఫోటో గ్రాఫ్‌లు ప్రొడక్షన్ హౌస్ మెయిల్ ఐడీకి పంపుతున్నారు.

also read: నా కులం అదే.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్

Prabhas, Kalki 2898ad, Nag ashwin
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.