Home  »  News  »  సంచలన నిర్ణయం: ఆ ఇన్స్టాగ్రామ్ పేజీకి సినిమా టికెట్ పంపించండి.. డబ్బులు తీసుకోండి

Updated : Aug 10, 2026

 

తెలుగు చిత్ర సీమ ఎంతో అదృష్టం చేసుకున్న నటుల్లో రాజేంద్రప్రసాద్ ఒకరు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను డల్ గా ఉన్నపుడు రాజేంద్రప్రసాద్ సినిమా చూస్తానని చెప్పారు. దీన్ని బట్టి రాజేంద్రప్రసాద్ నటనకి ఉన్న పవర్ అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు తన కొత్త చిత్రం 'పాంచాలి పంచభర్తృక' తో  ఆగస్టు 14 న థియేటర్స్ లోకి వస్తున్నాడు.  గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ వినోదాత్మక చిత్రాన్ని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం  ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 

నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో  దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతు సినిమాను చూసిన తర్వాత మీకు సినిమా నచ్చకపోతే,  రాయల్ థ్రోన్ ఇన్స్టాగ్రామ్ పేజీకి సినిమా టికెట్ ఫోటో పోస్ట్ చేస్తే, టికెట్ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాం. తెలుగు చిత్రసీమలో దిగ్గజ దర్శకులైన ఈవీవీ సత్యనారాయణ, జంధ్యాల, అనిల్ రావిపూడి వంటి వారి చిత్రాల తరహాలోనే ఫ్రేమ్ నిండా 50 మందికి పైగా కళాకారులతో అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా  చిత్రాన్ని మలిచాం. వయోభేదం లేకుండా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ఉత్సాహంతో డ్యాన్స్ పాటలు, విరోచిత ఫైట్స్ చేసి ఈ సినిమానిసరికొత్త ఎత్తులకి  తీసుకెళ్లారని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారి ఆంటీ కూడా ఈ చిత్రంలో ప్రాధాన్యత గల క్యారక్టర్ లో కనిపించనుంది. 

Also Read: దారుణం: డ్రింక్ లో మత్తుమందు.. ప్రముఖ నటిని రేప్ చేసిన 73 ఏళ్ళ దర్శకుడు

Rajendra Prasad, Panchali panchabharthruka

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.