![]() |
![]() |
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా పరిచయమైన క్రేజీ యాక్షన్ డ్రామా ‘డీసీ’ థియేటర్లలో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో రన్ అవుతున్న ఈ చిత్రం, మొదటి వీకెండ్ ముగిసేసరికి మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా, వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి కథానాయికలుగా నటించారు. ఇద్దరు ప్రతిభావంతులైన దర్శకులు కలిసి చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తాజా ట్రేడ్ వర్గాల నివేదిక ప్రకారం, ఈ సినిమా మూడో రోజైన ఆదివారం దేశవ్యాప్తంగా ఏకంగా రూ. 9.55 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి సత్తా చాటింది. శనివారం రూ. 7 కోట్లు రాబట్టిన ఈ సినిమా సండే నాటికి దాదాపు 36 శాతానికి పైగా వృద్ధి నమోదు చేయడం విశేషం. దీంతో మూడు రోజుల్లోనే భారత్‌లో మొత్తం రూ. 20.95 కోట్ల నెట్ (గ్రాస్ రూ. 24.11 కోట్లు) వసూలు చేసింది.
తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. కేవలం మూడో రోజే తెలుగు వెర్షన్ నుంచి రూ. 2.30 కోట్లు రాగా, ఓవర్సీస్‌లోనూ మంచి మార్కెట్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3 రోజుల్లోనే రూ. 31 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
మాస్ అండ్ యాక్షన్ చిత్రాలతో గుర్తింపు పొందిన లోకేష్ కనగరాజ్, మొదటిసారిగా వెండితెరపై నటుడిగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అరుణ్ మాథేశ్వరన్ రో మేకింగ్, అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
సోషల్ మీడియాలోనూ ‘డీసీ’ మూవీకి సంబంధించిన పాజిటివ్ రివ్యూలు, వీడియో క్లిప్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లోకేష్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మొదటి వీకెండ్‌లోనే ఊహించిన దానికంటే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ‘డీసీ’, వర్కింగ్ డేస్‌లో కూడా ఇదే జోరును కొనసాగిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా సాధించబోయే లాంగ్ రన్ వసూళ్లపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Lokesh Kanagaraj DC Movie, DC Day 3 Collections, DC Box Office Collection, Arun Matheswaran, Wamiqa Gabbi
![]() |
![]() |