![]() |
![]() |
69 సంవత్సరాలుగా దేశంలోని పలు చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలకు వివిధ శాఖల్లో జాతీయ స్థాయిలో అవార్డులు అందిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే 2021 సంవత్సరానికి గాను ప్రకటించిన 69వ జాతీయ అవార్డులు ఎంతో మంది నిరాశకు, ఆగ్రహానికి కారణమయ్యాయి. తెలుగు సినిమాలకు ఏకంగా 10 అవార్డులు రావడం అనే విషయాన్ని కొంతమంది హీరోలు, దర్శకనిర్మాతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొందరు రాజకీయ నాయకులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. హీరో నాని తన ఇన్‌స్టాలో సూర్య నటించిన ‘జైభీమ్’ చిత్రానికి అవార్డు రాకపోవడం పట్ల తీవ్రంగా స్పందించాడు.
ఇదిలా వుంటే.. ఈ అవార్డుల విషయం గురించి దగ్గుబాటి రానా వద్ద ప్రస్తావించగా.. ‘ఒక సినిమా సూపర్‌హిట్ అయ్యిందంటే అది అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చకపోవచ్చు. మీకు నచ్చిన సినిమాకు నాకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే రకరకాల మనుషులు, రకరకాల అభిరుచులు. సినిమాల విషయంలో కూడా అది వర్తిస్తుంది. ఒకరికి నచ్చింది అందరికీ నచ్చాలనే రూల్ ఎక్కడా లేదు. నిజంగానే ‘జైభీమ్’ సినిమాకి జాతీయ అవార్డు వస్తుందని అందరూ భావించారు. కానీ, రాలేదు. దీనిపై చాలా మంది తమ అభిప్రాయాన్ని వివిధ మాధ్యమాల్లో తెలియజేశారు. కేవలం తమ అభిప్రాయాన్ని ట్వీట్ చేశారంతే. కానీ, కొంతమంది దాన్ని కాంట్రవర్సీగా మార్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మా ఆర్టిస్టుల మధ్య ఎలాంటి విభేదాలు, వివాదాలు వుండవు’ అన్నారు.
![]() |
![]() |