![]() |
![]() |
.jpg)
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో. గత రెండు సంవత్సరాలుగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ రీసెంట్‌గా నటించిన ‘జనతాగ్యారేజ్’ ఈ ఇయర్ టాలీవుడ్ ఫిల్మ్ హిస్టరీలో హైయెస్ట్ కలెక్షన్స్ మూడో స్థానంలో వుంది. మొదటి స్థానంలో ‘బాహుబలి’, రెండో స్థానంలో ‘శ్రీమంతుడు’చిత్రాలు వున్నాయి. కాగా అతి త్వరలో ఎన్టీఆర్-బాబీ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఇంకా సెట్స్ మీదకి వెళ్లకుండానే భారీ క్రేజ్ సంపాదించుకుంది ఈ చిత్రం. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే.. ఈ చిత్రానికి ‘నటవిశ్వరూపం’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని యూనిట్ ఆలోచిస్తోందట. ఈ మూవీ కథకి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో.. ఆ పేరే పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’పై నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర ఉండగా.. దానికి రమ్యకృష్ణ సరైన న్యాయం చేస్తుందని యూనిట్ ఆమెని సంప్రదించిందట. ఎన్టీఆర్ సినిమా అనగానే ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇందులో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్, నివేదా థామస్, అనుపమలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
![]() |
![]() |