![]() |
![]() |

భారీ బడ్జెట్‌లు, భారీ స్టార్ క్యాస్టింగ్‌లు ఉన్న సినిమాలు ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించలేకపోవడంతో డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి. తక్కువ బడ్జెట్ అయినా..కథ, కథనాలు కొత్తగా ఉంటే చిన్న సినిమాలు సైతం ఆదరిస్తామని నిరూపిస్తున్నారు ప్రేక్షక దేవుళ్లు. ఆ నమ్మకంతోనే ఈ ఇయర్ ఎండింగ్‌లో మరో చిన్న సినిమా కంటెంట్‌ను నమ్ముకొని వచ్చేస్తోంది. రాక్షసులని సమాజమే తయారు చేస్తుందా..పుట్టుకతో అందరూ మంచివాళ్లేనా..మనుషులు రాక్షసంగా మారడానికి సమాజమే కారణమా అన్న కథాంశంతో, సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న మూవీ "నేనొస్తా". రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న "నేనొస్తా" విడుదల కానుంది. జ్ఞాన్, సూర్య, శ్రీనివాస్, ప్రియాంక పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు దర్శకత్వం పరంధ్ కళ్యాణ్..నిర్మాణం రైజీంగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్, నిర్మాత బాషా మజహర్.
![]() |
![]() |