![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి లంబోర్గిని కారు వచ్చింది. కొన్ని నెలల క్రితమే ఆ కంపెనీ కారును ఎన్టీఆర్ బుక్ చేశాడు. గతంలో కారు డెలివరీ అయినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు యంగ్ టైగర్ టీమ్ ఆ వార్తలను ఖండించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లంబోర్గిని కార్ తారక్‌ది కాదని వివరణ ఇచ్చింది. అసలు విషయం ఏంటంటే... జూనియర్ ఎన్టీఆర్ కారు ఇప్పుడు ఇంటికి వచ్చింది.
యంగ్ టైగర్ కొత్త కారుకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే... భారతదేశంలో అటువంటి లంబోర్గిని కారు ఇంకెవరి దగ్గర లేదు. Urus Grapfite Capsule మోడల్ లంబోర్గిని కారును తారక్ కొనుగోలు చేశారు. ఇండియాలో ఈ కారు ఉన్న తొలి వ్యక్తి ఆయన. ఈ కారుకు మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. లంబోర్గిని బెంగళూరు షోరూం నుండి హైదరాబాద్ కు కారును డెలివరీ చేశారు. గతంలో ప్రభాస్ కూడా లంబోర్గిని కార్ కొన్నారు. అయితే ఆ మోడల్ వేరు.
![]() |
![]() |