![]() |
![]() |

సుదీర్ఘ కాలం సాగిన రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్' సీజన్ 12 ఎట్టకేలకు ముగిసి, ఉత్తరాఖండ్‌కు చెందిన సింగర్ పవన్‌దీప్ రాజన్ విన్నర్ ట్రోఫీని చేతబట్టాడు. అతను రూ. 25 లక్షలు ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. అలాగే మారుతి సంస్థ రెడ్ కలర్ స్విఫ్ట్ కారును అతనికి బహూకరించింది. ఈ పోటీలో తెలుగమ్మాయి షణ్ముఖప్రియ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఆరుగులు ఫైనలిస్టుల్లో చివరి స్థానాన్ని మాత్రమే పొందగలిగింది. ఫస్ట్ రన్నరప్‌గా అరుణితా కంజీలాల్, సెకండ్ రన్నరప్‌గా సయాలీ కాంబ్లే నిలిచారు. నాలుగో స్థానాన్ని మొహమ్మద్ డానిష్, ఐదో స్థానాన్ని నిహాల్ టారో పొందారు.
కాగా ఇండియన్ ఐడల్ 12 ఆరుగురు ఫైనలిస్టులు కలిసి ఒక రోడ్ ట్రిప్‌కు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని పవన్‌దీప్ వెల్లడించాడు. "నేను నా ఆరుగురు ఇండియన్ ఐడల్ స్నేహితులతో కేదార్‌నాథ్‌కి రోడ్డు ప్రయాణం చేస్తాను. ఆ తర్వాత నా తల్లిదండ్రులను కూడా బయటకు తీసుకువెళ్తాను. కానీ అంతకు ముందు నేను ఈ ఫైనలిస్టులతో 10 రోజుల ట్రిప్‌కు వెళ్లాలనుకుంటున్నాను. ముందుగా మేమంతా ఇంటికి వెళ్లి కుటుంబంతో కొంత సమయం గడుపుతాం. మేం కేదార్‌నాథ్‌కు వెళ్తాం. ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చి ఒకే భవనంలో ఫ్లాట్‌లను కొనుగోలు చేసి అక్కడ అందరం కలిసి ఉంటాం." అని అతను చెప్పాడు.
తను ఇండియన్ ఐడల్ 12 ట్రోఫీని చేతబట్టుకోవడం చూసి తన తల్లిదండ్రులు నిజంగా చాలా సంతోషించారని కూడా అతను పంచుకున్నాడు. తనకు ఓటు వేసిన అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.
![]() |
![]() |