![]() |
![]() |

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద వినూత్నమైన సినిమాల్ని నిర్మిస్తూ సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వచ్చిన 'కుమారి 21 ఎఫ్', 'ఉప్పెన' వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మార్చి 19న విడుదల అవ్వనున్న కార్తికేయ లేటెస్ట్ మూవీ 'చావు కబురు చల్లగా' ట్రైలర్ ని చూశాడు సుకుమార్. అందులో కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయిన ఆయన తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఓ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశాడు.
నవంబర్‌లో ప్రారంభమయ్యే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను ఆయనే స్వయంగా సమకూరుస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడి కానున్నది. సో.. కార్తికేయ కెరీర్ క్రమంగా టర్న్ తీసుకుంటున్నదన్న మాటే. ఇప్పటికే మెగా కాంపౌండ్‌లో ఛాన్స్ దక్కించుకొని చావు కబురు చల్లగా సినిమా చేసిన అతనికి సుకుమార్ రైటింగ్స్ సినిమా మరో మంచి అవకాశం అని చెప్పాలి.
![]() |
![]() |