![]() |
![]() |

కేవలం రెండు వారాల వ్యవధిలో `భీమ్లా నాయక్`, `రాధే శ్యామ్` (నేపథ్య సంగీతం) వంటి భారీ బడ్జెట్ మూవీస్ తో పలకరించాడు యువ సంగీత సంచలనం తమన్. ప్రస్తుతం ఈ స్టార్ కంపోజర్ `సర్కారు వారి పాట`, `గాడ్ ఫాదర్`, `NBK 107`, `SSMB 28`,`RC 15` వంటి బడా ప్రాజెక్ట్స్ కి బాణీలు అందిస్తున్నాడు. కాగా, తాజాగా తమన్ ఖాతాలో మరో బిగ్ టికెట్ ఫిల్మ్ చేరిందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి ఓ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ వెంచర్ కి.. స్వరవాణి కీరవాణి బాణీలు అందించబోతున్నట్లు ఒకవైపు కథనాలు వస్తున్నాయి. మరోవైపు.. తమన్ పేరు కూడా ఈ సినిమాకి ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే ప్రభాస్ - మారుతి కాంబినేషన్ మూవీలో తమన్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
Also Read :Clap movie review: Aadhi Pinisetty Shines in this well Made sports drama
కాగా, ప్రభాస్ `రాధే శ్యామ్`కి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన తమన్.. గతంలో మారుతి డైరెక్ట్ చేసిన `మహానుభావుడు`, `ప్రతి రోజూ పండగే`కి స్వరాలు సమకూర్చాడు.
![]() |
![]() |