![]() |
![]() |

కాలం కలిసిరాకపోతే ఓడలు బండ్లు .. బండ్లు ఓడలు అవుతాయి అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అదే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మరోసారి స్పష్టమైంది. నాలుగు దశల్లో జరిగిన బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ ఎన్నికలో ఫస్ట్ నుంచి సూపర్ యాక్టివ్‌గా ఉండి అందరి కాయిన్స్ ఎత్తేసిన మెహబూబ్ చివరికి సుజాత స్విచ్ కాయిన్ తో చిత్తు అయ్యాడు. హౌస్ లో ఉన్నాడా.. టాస్క్ ఆడాడా అన్నట్లు కనిపించిన కుమార్ సాయి బిగ్ హౌస్ కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. మూడురోజుల పాటు సాగిన ఈ టాస్క్ లో చివరికి కెప్టెన్సీ కుమారసాయిని వరించింది. టాస్క్ లో ప్రారంభమైన సోహైల్, అమ్మ రాజశేఖర్ మధ్య గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. జీవితంలో నీతో మాట్లాడను అంటూ చివరికి రాజేశేఖర్ గొంతచించుకుని అరిచే రేంజ్ కు వారి గొడవ పోయింది. .
బిగ్ హౌస్ కెప్టెన్సీ టాస్క్ లో రెండోదశలో ఇంటిసభ్యులంతా హుషారుగా పాల్గొన్నారు. అవినాష్ కాలు బెణకడంతో హాస్పిటల్ కు తీసుకుపోయారు. కాలుకి పట్టికట్టి రెస్ట్ తీసుకోమనడంతో టాస్క్ కు దూరంగా ఉన్నాడు. లాస్య, అమ్మ రాజశేఖర్ మాట్లాడుతుండగా సోహైల్ వచ్చి మాస్టర్ ముందు మోకాళ్ల పై కూర్చున్నాడు. గేమ్స్ కోసమే కాయిన్లు దొంగిలించాను అంటూ క్షమాపణలు కోరాడు. దాంతో చిల్ అయిన అమ్మ రాజశేఖర్ నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నా దగ్గర కాయిన్లు తీసుకున్నావ్ అంటూ క్షమించేసాడు. అంతలో టాస్క్ పూర్తి చేయాలని బిగ్ బాస్ ఆదేశం రావడంతో అందరు గార్డెన్ ఏరియాలోకి వచ్చారు.
![]() |
![]() |