![]() |
![]() |
మనుషులన్న తర్వాత తప్పులు చేస్తారు. వారు చేసిన తప్పుల వల్ల ఎదుటివారు ఇబ్బంది పడడం, బాధపడడం వంటివి సహజంగానే జరుగుతాయి. ఆ తప్పు తెలుసుకున్నరోజు, దాని గురించి పశ్చాత్తాప పడినరోజు వారిని తప్పకుండా క్షమించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే తప్పు చేయడం మానవ సహజం, మన్నించడం దైవగుణం అన్నారు పెద్దలు. ఇప్పుడా మాటను హీరోయిన్ త్రిష కూడా అంటోంది.
ఇటీవల త్రిష, మన్సూర్ అలీ ఖాన్‌ల మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. త్రిషపై మన్సూర్ అసభ్యంగా కామెంట్ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం, ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విషయంలో జోక్యం చేసుకొని త్రిషకు మద్దతు తెలపడం జరిగింది. ఈ విషయంలో మన్సూర్‌పై కేసు కూడా నమోదు కావడంతో.. చేసేది లేక చివరికి త్రిషను క్షమించమని అడిగాడు మన్సూర్. దీనిపై స్పందించిన త్రిష ‘తప్పు చేయడం మానవ సహజం.. మన్నించడం దైవగుణం’ అని తన సమాధానాన్ని తెలియజేసింది.
![]() |
![]() |