![]() |
![]() |

తెలుగు సినిమా రంగంలో గీత ఆర్ట్స్ సంస్థకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ప్రతి హీరో, హీరోయిన్, దర్శకుడుతో పాటు మొత్తం 24 క్రాఫ్ట్స్ కి చెందిన వాళ్లంతా గీత ఆర్ట్స్ లో సినిమా చేస్తే ఇండస్ట్రీ లో తమ కెరీర్ కి ఎలాంటి డోకా ఉండదు అని భావిస్తారు. అలాంటి గీత ఆర్ట్స్ సంస్థ నుంచి వచ్చిన మరో సంస్థ గీత ఆర్ట్స్ 2 . జి ఏ 2 బ్యానర్ తో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఆ నిర్మాణ సంస్థ బాధ్యతలని నిర్వహిస్తున్నాడు. బన్నీ వాసు కి ఒక డైరెక్టర్ కి మధ్య గతంలో గొడవలు జరిగాయని వచ్చిన ఆరోపణల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఆయన తాజాగా బయటపెట్టాడు.
జి ఏ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ గీత గోవిందం.ఈ చిత్రం సాధించిన విజయం గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమా టైంలోనే పరశురామ్ ఇంకో కొత్త కథని బన్నీ వాసుతో చెప్పాడు. బన్నీ వాసుకి కూడా ఆ కథ బాగా నచ్చి విజయ్ తోనే చేద్దామని నిర్ణయించుకొని విజయ్ కి ఫోన్ చేసి కథ చెప్పడంతో విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బన్నీ వాసు ఈ విషయాన్ని అల్లు అరవింద్ కి కూడా చెప్పాడు. కానీ చివరికి పరుశురాం ఆ కథని సర్కారు వారి పాట సినిమా టైం లో దిల్ రాజు కి కూడా చెప్పడంతో దిల్ రాజు ఆ కథని ఓకే చేసి విజయ్ నే హీరోగా ప్రకటించాడు.

ఈ సంఘటనతో అరవింద్ అండ్ బన్నీ వాసులు చాలా బాధపడ్డారు. ఆ తర్వాత పరశురామ్ ని బన్నీ వాసు వివరణ కోరగా నేను మహేష్ తో చేసే సినిమా షూటింగ్ టైంలో దిల్ రాజు కి ఏదో సరదాగా లైన్ చెప్పడంతో ఆయన వెంటనే విజయ్ హీరోగా సినిమాని ప్రకటించాడని చెప్పాడు. ఆ తర్వాత దిల్ రాజు బన్నీ వాసుకి ఫోన్ చేసి కొత్త సినిమాలో వాటా కావాలంటే తీసుకోమన్నాడు కానీ అరవింద్ గారు వద్దన్నారు.ఈ విషయాలన్ని బన్నీ వాసు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఆ కథ తో వస్తున్న సినిమానే కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ ,మృణాళిని ఠాకూర్ ల తో ప్రారంభం అయిన సినిమా.
![]() |
![]() |