![]() |
![]() |

`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. కీర్తి సురేశ్ కథానాయికగా దర్శనమివ్వనున్న ఈ సినిమాని `గీత గోవిందం` డైరెక్టర్ పరశురామ్ రూపొందిస్తున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సోషల్ డ్రామాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మాలీవుడ్ యాక్టర్ జయరామ్ ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. మహేశ్ బాబుకి తండ్రిగా ఆయన కనిపించబోతున్నట్లు టాక్. ఇప్పటికే జయరామ్.. `భాగమతి`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో అలరించారు. అంతేకాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పిరియడ్ లవ్ సాగా `రాధేశ్యామ్`లోనూ దర్శనమివ్వనున్నారు. త్వరలోనే `సర్కారు వారి పాట`లో జయరామ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, 2022 సంక్రాంతి కానుకగా `సర్కారు వారి పాట` థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |