![]() |
![]() |
.webp)
సింధూరం సినిమా పేరు వినగానే కృష్ణవంశీ గుర్తుకొస్తాడు. మురారి నుండి గోవిందుడు అందరివాడేలే వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు కృష్ణవంశీ. అయితే ఆయన సినిమాలకి పాటలు రాసింది ఎక్కువగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.
కృష్ణవంశీ తాజాగా ఓ కార్యక్రమానికి అటెండ్ అవ్వగా... అందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి తనకి మధ్య ఉన్న అభిమానాన్ని, అనుబంధాన్ని పంచుకున్నాడు. సిరివెన్నెల గారితో మీ పరిచయం ఎప్పుడు మొదలైందని కృష్ణవంశీని అడుగగా.. తాడేపల్లిగూడెంలో డిగ్రీ పూర్తిచేసి సినిమాల్లోకి వెళ్దామనుకున్న సమయంలో ' సిరివెన్నెల' సినిమా రిలీజైంది. సినిమా చూస్తున్న అందులో మ్యూజిక్ తో పాటు సాహిత్యం బాగుంది. వేటూరి గారు రాసారేమో అనుకున్నాను కానీ సీతారామశాస్త్రి గారు రాసారని తర్వాత తెలిసింది. ఇక అప్పటి నుండి ఆయన రాసిన అన్ని పాటలు వినడం మొదలెట్టాను.
సీతారామశాస్త్రిగారు రాసిన 'ఆది భిక్షువు' పాట వినగానే నేను ఆలోచనలో పడిపోయాను. ఇంత గొప్ప సాహిత్యాన్ని ఎవరా రాసింది అని తెలుసుకున్నాను. ఆ తరువాత కొంతకాలానికి నేను 'బ్రహ్మ నీరాత తారుమారు' అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆ సమయంలోనే నేను మొదటిసారిగా సిరివెన్నెల గారిని చూశాను. ఆయన మా ఆఫీసులోనే పాట రాస్తూ, మంచినీళ్లు - టీ పట్టుకుని రమ్మన్నారు. ఆయన నన్ను ఆఫీస్ బాయ్ అనుకుంటున్నారనే విషయం నాకు అర్థమైంది. అయినా నేనేం హర్ట్ కాలేదు. వెళ్లి ఆయనకి టీ తీసుకుని వచ్చాను. ఆ తరువాత 'శివ' సినిమా సమయంలో కలుసుకున్నాము. అక్కడి నుంచి వరుస సినిమాలకు కలిసి పనిచేశాము. అలా ఆయనతో సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. ఆయనతో అత్యంత చనువుగా ఉండేవారిలో నేను ఒకడిని కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానని కృష్ణవంశీ చెప్పాడు.
![]() |
![]() |