![]() |
![]() |
ప్రతి మనిషి జీవితంలో వెలుగు నీడలు సర్వసాధారణం. ఇక సినిమా రంగంలో అయితే ప్రత్యేకంగా చెపక్కర్లేదు. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అందరూ పక్కనే ఉంటారు. అవసరానికి మించి ఆదరిస్తారు. ముఖ్యంగా నటీనటుల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఫామ్లో ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తారు. ఒక్కసారి గతి తప్పిందంటే ఎవ్వరూ వారిని పట్టించుకోరు. సినిమా రంగంలో ఎంతోమంది నటీనటులు ఒక దశలో ఉన్నతంగా బ్రతికినవారు చరమాంకంలో అత్యంత దీనస్థితిని అనుభవించారు. నా అనేవారు లేక చనిపోయినవారు చాలా మంది ఉన్నారు.
అలాంటి దీనావస్థ ఓ నటుడికి వచ్చింది. మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కె.డి. జార్జ్ అనారోగ్యంతో డిసెంబర్ 29న మరణించాడు. అయితే ఆయనను కడసారి చూసేందుకుగానీ, అంత్యక్రియలు జరిపించేందుకుగానీ ఎవరూ ముందుకు రాలేదు. రెండు వారాలుగా మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు. చివరకు విషయం తెలుసుకున్న తోటి డబ్బింగ్ ఆర్టిస్స్ అసోసియేషన్ చొరవ తీసుకొని కేరళ ప్రభుత్వాన్ని సంప్రదించింది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో 16 రోజుల తర్వాత సంక్రాంతి రోజునే అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతిపై పలువురు నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.
![]() |
![]() |