![]() |
![]() |

ఉప్పెన సినిమాతో వెండి తెరమీదకి దూసుకొచ్చిన నటుడు వైష్ణవ్ తేజ్.ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. అలాగే మెగా వారసత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా చాలా చక్కగా నటించాడు. ఇప్పుడు అదే మెగా వారసత్వం గురించి వైష్ణవ్ చెప్పిన మాట ఇండస్ట్రీ లో సంచలనం సృష్టిస్తుంది.
వైష్ణవ్ నుంచి తాజాగా రాబోతున్న చిత్రం ఆదికేశవ. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో వైష్ణవ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విలేకరి వైష్ణవ్ కి ఒక పిక్ చూపించాడు. వైష్ణవ్ తన తల మీద చిరు అని కట్ చేయించుకున్న పిక్ అది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అందరు పెద్ద మామయ్య కి రకరకాలుగా బర్త్ డే విషెస్ చెప్తున్నారు. అన్నయ్య సాయి ఏమో ఒక పెద్ద ఖడ్గం లాంటిది బహుమతి గా ఇచ్చాడు. నేను ఏం ఇవ్వగలుగుతాను నా ప్రాణం తప్ప అని ఆలోచించాను.సరిగ్గా అప్పుడే ఒక ఫుట్ బాల్ మ్యాచ్ చుసాను.అందులో ఒక ఆటగాడు తన తల మీద పేరు వేసుకోవడం చూసాను ఇక అంతే నేను కూడా వెంటనే తల మీద చిరు అనే అక్షరాలు రాసుకున్నాను అసలు చిరంజీవిపెద మామ అని రాసుకుందామనుకున్నాను కానీ నా తల సరిపోలేదు అని చెప్పాడు.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.అలాగే రామ్ చరణ్ తో తనకున్న అనుబంధాన్ని కూడా వైష్ణవ్ తెలిపాడు .
ఇక వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తర్వాత చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికల పడ్డాయి.ఇప్పుడు రాబోతున్న ఆదికేశవ సినిమాతో వైష్ణవ్ మొట్టమొదటి సారి ఫుల్ లెంగ్త్ మాస్ క్యారక్టర్ ని పోషిస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలని పెంచేలా చేసింది శ్రీలీల కథానాయిగా నటిస్తున్న ఈ మూవీ 24 న విడుదల కాబోతుంది. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడు
![]() |
![]() |