![]() |
![]() |

కొన్నిసార్లు ఊహించని కాంబినేషన్ లో సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ ఊహించని కాంబినేషనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ కాంబో ఎవరో కాదు.. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.
డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకొని యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న సిద్దు.. ప్రస్తుతం 'టిల్లు స్క్వేర్', 'తెలుసు కదా' వంటి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో.. బొమ్మరిల్లు భాస్కర్ తో చేతులు కలిపాడు.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా SVCC 37 అని ఫిక్స్ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనట్లు ఓ స్ట్రైకింగ్ పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో సిద్దు కనిపిస్తున్నారు.
'బొమ్మరిల్లు' వంటి క్లాసిక్ ఫిల్మ్ తో దర్శకుడిగా పరిచయమై ఆ సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్న భాస్కర్.. పరుగు, ఆరెంజ్ వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. 2013 లో వచ్చిన 'ఒంగోలు గిత్త' తర్వాత లాంగ్ బ్రేక్ ఇచ్చిన ఆయన.. 2021 లో 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్'తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. భాస్కర్ కి క్లాస్ దర్శకుడిగా పేరుంది. అలాంటి డైరెక్టర్‌తో.. మాస్ ఇమేజ్ ఉన్న యూత్ సెన్సేషన్ సిద్దు సినిమా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. పైగా పోస్టర్ లో డైరెక్టర్ భాస్కర్ గన్ పట్టుకోవడం చూస్తుంటే ఇది ఆయన శైలి సినిమా కాదని అర్థమవుతోంది
మరోవైపు ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్లు తెలిపారు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నారు.
![]() |
![]() |