![]() |
![]() |
.jpg)
కెమెరాను ఫేస్ చేసిన ప్రతిసారీ తన సూపర్బ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తూ వస్తున్న మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్. ఇటీవల అతను 'అనుకోని అతిథి',' ట్రాన్స్', 'జోజి' లాంటి సినిమాల్లో ప్రదర్శించిన నటనతో ఆడియెన్స్‌ను అలరించాడు. ప్రస్తుతం అతను అల్లు అర్జున్-సుకుమార్ కాంబో మూవీ 'పుష్ప'లో విలన్‌గా నటిస్తున్నాడు. అతను మెయిన్ లీడ్‌గా నటించిన మలయాళం మూవీ 'మాలిక్' థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ కుతూహలంగా ఎదురుచూస్తూ వస్తున్నారు. దురదృష్టవశాత్తూ అది జరగడం లేదు. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదలైతే బాగుండునని ఫాజిల్ సైతం ఎంతగానే ఆశించాడు.
'మాలిక్' మూవీ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం డిజైన్ చేసిందనీ, 100 శాతం థియేటర్లు ఓపెన్ అయ్యాక ఈ సినిమా రిలీజ్ చెయ్యాలనుకున్నమనీ అతను తెలిపాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడదు కాబట్టి, భారమైన మనసులతోటే తామందరం ఓటీటీకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నామనీ, అందరూ దీనికి సహకరించి 'మాలిక్'ను చూడాలనీ ఫాజిల్ రిక్వెస్ట్ చేశాడు.
'మలయన్‌కుంజు' సినిమా సెట్స్‌పై జరిగిన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఘటనపై కూడా అతను మాట్లాడాడు. ఆ సినిమా సెట్స్‌పై మార్చి 3న అతను గాయపడ్డాడు. ఆ టైమ్‌లో అతను ఓ స్టంట్ సీక్వెన్స్‌లో పాల్గొన్నాడు. చాలా ఎత్తు నుంచి నుంచి కిందికి దూకే టైమ్‌లో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయాడు. ఫలితంగా అతని ముక్కు పగిలింది. అందువల్ల తనకు మార్చి 2 నుంచే లాక్‌డౌన్ మొదలైనట్లయ్యిందని అతను తెలిపాడు.
"నా ముఖం నేలను తాకడానికి ముందు డిఫెన్స్ మెకానిజంలో భాగంగా చేతులను ఆనించాను. 80 శాతం కేసుల్లో బాధితులు ఈ పని చేయరు, ఎందుకంటే ఆ టైమ్‌లో వాళ్ల బుర్ర పనిచేయదు కాబట్టి. మా డాక్డర్ చెప్పినదాన్ని బట్టి లక్కీగా నేను నా మైండ్‌ను ఉపయోగించాను. ఇలా ప్రాణాపాయం నుంచి బయటపడ్డం ఎన్నోసారో నాకు తెలీదు. ఆ రకంగా కూడా నేను అదృష్టవంతుడ్ని." అని చెప్పుకొచ్చాడు ఫహాద్ ఫాజిల్.
![]() |
![]() |