![]() |
![]() |

కరోనా మహమ్మారి కారణంగా ఎందరో కన్నుమూశారు. తాజాగా సీనియర్ నటి కవిత ఇంట్లోనూ కరోనా మహమ్మారి విషాదం నింపింది. ఆమె తనయుడు సంజయ్ రూప్ కరోనాతో మృతి చెందాడు. ఇటీవల కరోనా వైరస్ బారినపడి సంజయ్ హోం క్వారంటైన్లో ఉన్నాడు. అయితే, అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు.
సంజయ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కవిత భర్త దశరథరాజు కూడా కరోనా బారినపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
కాగా కవిత 'ఓ మజ్ను' అనే తమిళ చిత్రంతో 11 ఏళ్ల వయస్సులో వెండితెర అరంగ్రేటం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి ప్రవేశించిన కవిత.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించింది.
![]() |
![]() |