![]() |
![]() |

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్'. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. డిసెంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ గత చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచినప్పటికీ 'ఎక్స్ ట్రా' థియేట్రికల్ బిజినెస్ 'ఎక్స్ ట్రార్డినరీ'గా జరగడం విశేషం.
'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్' ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.24 కోట్లకు పైగా ఉందని తెలుస్తోంది. నైజాంలో రూ.7.50 కోట్లు, సీడెడ్ లో రూ.3 కోట్లు, ఆంధ్రాలో రూ.9 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ.19.50 కోట్ల బిజినెస్ చేసినట్లు అంచనా. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.1.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.3 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.24.20 కోట్ల బిజినెస్ చేసిందట. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ.25 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
ప్రస్తుతం నితిన్ ట్రాక్ రికార్డును బట్టి చూస్తే 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్' బిజినెస్ ఎక్కువగా చేసినట్లే లెక్క. నితిన్ గత మూడు సినిమాలను గమనిస్తే.. చెక్ రూ.16 కోట్లు, రంగ్ దే రూ.23.90 కోట్లు, మాచర్ల నియోజకవర్గం రూ.21.20 కోట్ల బిజినెస్ చేశాయి. అయితే ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిలిగాయి. అయినప్పటికీ ఇప్పుడు ఈ 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమా వాటికంటే ఎక్కువ బిజినెస్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
![]() |
![]() |