![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని రేపు(డిసెంబర్ 7న) 'హాయ్ నాన్న' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో నానితో పాటు మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే క్లాస్ సినిమా అయినప్పటికీ.. భారీగా కాకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలోనే థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
'హాయ్ నాన్న' ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.27 కోట్లకు పైగా ఉందని తెలుస్తోంది. నైజాంలో రూ.8.50 కోట్లు, సీడెడ్ లో రూ.2.60 కోట్లు, ఆంధ్రాలో రూ.9 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ.20.10 కోట్ల బిజినెస్ చేసినట్లు అంచనా. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.2 కోట్లు, ఓవర్సీస్ లో రూ.5.50 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.27.60 కోట్ల బిజినెస్ చేసిందట. ఈ సినిమా హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే రూ.28 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది.
నాని గత మూడు చిత్రాలను గమనిస్తే.. శ్యామ్ సింగరాయ్ రూ.22 కోట్లు, అంటే సుందరానికీ రూ.30 కోట్లు, దసరా రూ.50 కోట్ల బిజినెస్ చేశాయి. అయితే 'దసరా' మాస్ సినిమా కావడంతో భారీ బిజినెస్ చేసింది. 'హాయ్ నాన్న' క్లాస్ సినిమా కావడంతో రూ.27.60 కోట్లతో సరిపెట్టుకుంది.
![]() |
![]() |