![]() |
![]() |

యువ దర్శకులలో తనకు 'బలగం' ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని నేచురల్ స్టార్ నాని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇది నాని ఏదో క్యాజువల్ గా అన్న మాట కాదని, నిజంగానే ఆయన వేణు డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మించనున్నాడని సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి 'ఎల్లమ్మ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు వినికిడి.
నాని సినిమాల టైటిల్స్ విషయంలో ఆయన అభిమానులు ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారు. 'శ్యామ్ సింగరాయ్', 'అంటే సుందరానికీ' వంటి సినిమాలు కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ.. టైటిల్స్ కారణంగానే ఎక్కువ మందికి రీచ్ కాలేదనేది కొందరి అభిప్రాయం. నాని తాజా చిత్రం 'హాయ్ నాన్న', తదుపరి చిత్రం 'సరిపోదా శనివారం' టైటిల్స్ విషయంలో కూడా ఆయన అభిమానులు అసంతృప్తిగానే ఉన్నారు. ఇవి కంటెంట్ కి సరిపోయే టైటిల్స్ అయ్యుండొచ్చు కానీ, మాస్ రీచ్ ఉన్న టైటిల్స్ కాదనేది వారి వాదన. ఇలాంటి సమయంలో నాని కొత్త సినిమాకి 'ఎల్లమ్మ' టైటిల్ అంటే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |