![]() |
![]() |

పలువురు సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ప్రముఖ ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్ 'వన్ ఎక్స్‌బెట్' కి ప్రమోటర్లు గా ఉన్నారు. వీరిలో సోను సూద్(Sonu Sood),ప్రముఖ హీరోయిన్, డాకు మహారాజ్ ఫేమ్ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)బెంగాలీ నటుడు అంకుష్ హజ్రాతో పాటు, కొంత మంది అగ్రశ్రేణి క్రికెట్ ప్లేయర్స్, పలువురు రాజకీయనాయకులు కూడా ఉన్నారు. వన్ ఎక్స్‌బెట్ ద్వారా వచ్చిన డబ్బుతో కొంత మంది భారత్‌తో పాటు విదేశాల్లోను ఆస్తులని కొనుగోలు చేసారని, ప్రముఖ దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్(ఈడి) తమ విచారణలో గుర్తించింది.
దీంతో ఆ ఆస్తులని 'ఈడి'(Ed)క్రిమినల్ ఇన్కమ్’గా పరిగణిస్తు, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోబోతోంది. త్వరలోనే తాత్కాలిక అటాచ్మెంట్ కోసం ఉత్తర్వులు జారీ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనికి అవసరమైన ఆమోదం కోసం PMLA అథారిటీకి ఆర్డర్‌ను పంపనున్నారు. ఆమోదం లభిస్తే ప్రత్యేక కోర్టులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేయనున్నది. కోర్టు అనుమతిస్తే, ఆయా ఆస్తులను శాశ్వతంగా జప్తు చేయనున్నారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురు సినీ నటులతో పాటు క్రికెటర్స్ ని కూడా ప్రశ్నించించడంతో పాటు, వాళ్ల బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కూడా ఈడీ పరిశీలిస్తోంది.
'వన్ ఎక్స్‌బెట్(Onexbet)అనేది కురాకో అనే ద్వీప దేశంలో ఉన్న కంపెనీ. దాని వెబ్సైట్, మొబైల్ యాప్ దాదాపు 70 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన బెట్టింగ్ జరిగే ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఇప్పటి వరకు ఈడీ నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
![]() |
![]() |