![]() |
![]() |

స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా టాలీవుడ్‌లో రెండు సినిమాలు తయారవుతున్నాయి. వాటిలో ఒకటి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'స్టూవర్ట్‌పురం దొంగ'. 'బయోపిక్ ఆఫ్ టైగర్' అనేది ట్యాగ్‌లైన్. వి.వి. వినాయక్ దగ్గర పనిచేసిన కె.ఎస్. ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. దీపావళి సందర్భంగా గురువారం ఈ మూవీలో ప్రధాన పాత్రధారి సాయిశ్రీనివాస్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అతను రెండు రకాల తుపాకులను పట్టుకొని గుబురుగడ్డంతో కనిపిస్తున్నాయి. ఇంతదాకా సాయిశ్రీనివాస్ చేసిన పాత్రలు ఒకెత్తయితే, టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్ ఒకెత్తు అనేలా అతని లుక్ ఉంది.
1980 బ్యాక్‌డ్రాప్‌లో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు డైరెక్టర్ చెప్పాడు. "అప్పట్లో నాగేశ్వరరావు ఎంతో చాకచక్యంగా దొంగతనాలు చేయడమే కాదు..పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేవారు. అంతే కాకుండా ఉన్నవాడిని దోచి లేని వాడికి పంచేవారు. దాంతో ఆయన్ని అందరూ రాబిన్ హుడ్ అని, టైగర్ నాగేశ్వరరావు అని పిలిచేవారు. ఓ పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంతో హార్డ్ వర్క్ చేసి తన లుక్ మొత్తాన్ని పూర్తిగా మార్చుకున్నారు." అని ఆయన తెలిపాడు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బెల్లంకొండ సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |