![]() |
![]() |

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో 2016లో రూపొందిన 'రమణ్ రాఘవ్' చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది. సైకో కిల్లర్ రమణ్ రాఘవ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమాలో హీరోగా నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫస్ట్ ఛాయిస్ కాదు.
తమిళ నటుడు ధనుష్‌తో ఈసినిమా చేయలని అనురాగ్ కశ్యప్ భావించారట. అతడికి కథను వినిపించారు. ధనుష్ ఈసినిమా చేయడానికి అంగీకరించారు. అనివార్య కారణాల వల్ల ఈ కాంబినేషన్ వర్కవుట్ కాలేదని అనురాగ్ కశ్యప్ అన్నారు. ధనుష్ స్థానంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా తీసుకొని అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను రూపొందించి విజయాన్ని అందుకున్నారు.
విజయ్‌సేతుపతితో ఓ సినిమా చేయాల్సిందని, కథ సిద్ధం చేయడానికి సమయం పట్టడంలో కార్యరూపం దాల్చలేదని అన్నారు. బాలీవుడ్‌లో తాను రూపొందించిన సూపర్ హిట్ సినిమాల్లో తమిళ హీరోలు ఎవరైతే బాగుంటుందో అనురాగ్ కశ్యప్ వివరిస్తూ 'దేవ్ డి' సినిమా సిద్ధార్థ్‌కు బాగుంటుందని, 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్'కు ధనుష్, విజయ్ సేతుపతి సరిపోతారని అన్నారు. 'శాక్రెడ్ గేమ్స్' వెబ్ సిరీస్ తమిళంలో రూపొందించాల్సి వస్తే అజిత్, విజయ్ సేతుపతి ఎంచుకుంటానని బదులిచ్చారు అనురాగ్ కశ్యప్.
![]() |
![]() |