![]() |
![]() |

డాన్స్ రియాలిటీ షో 'ఢీ', కామెడీ షో 'పటాస్', 'ఫన్ రాజా ఫన్' చేసే యాంకర్ వర్షిణికి బుల్లితెర కత్రినా కైఫ్ అని పేరు. హాట్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయి. అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తున్న ఈమె అందంగా ఉంటుంది. అందుకని, 'బిగ్ బాస్ 4' నిర్వాహకులు వర్షిణికి గాలం వేసినట్టు ఉన్నారు. అయితే, ఆవిడ నుండి సంతృప్తికర సమాధానం వాళ్లకు లభించలేదు. 'బిగ్ బాస్' నిర్వాహకులకు వర్షిణి నో చెప్పేశారు.
"బిగ్ బాస్ 4 గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ విషయంలో అందరికీ నేను ఒక స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆ షోలో నేను భాగం కావడం లేదు. అయామ్ నాట్ పార్ట్ ఆఫ్ 'బిగ్ బాస్'. నన్ను అప్రోచ్ అయ్యారు. అయితే నేను వెళ్లడం లేదు" అని వర్షిణి పేర్కొంది. అంతా సవ్యంగా జరిగితే ఆగస్ట్‌లో 'బిగ్ బాస్' నాలుగో సీజన్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటినుండి సెలక్షన్ కార్యక్రమాలు ప్రారంభించారు. తరుణ్, అల్లరి నరేష్ వంటి హీరోలు సహా పలువురి పేర్లు వినపడుతున్నాయి. అందులో బిగ్ బాస్ ఇంటిలోకి ఎవరు వెళతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
![]() |
![]() |