![]() |
![]() |

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. అయితే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడు జీవితమ్' యూనిట్ మాత్రం విపత్కర పరిస్థితుల్లో జోర్డాన్‌లో రెండు నెలల పాటు షూటింగ్ చేసి ఇటీవలే ఇండియాకు వచ్చారు. విదేశాల నుండి ఇండియాకి వచ్చిన వాళ్లు ఎవరైనా సరే క్వారంటెన్ ఉండాల్సిందే కదా! వీళ్లూ ఉన్నారు. హీరో పృథ్వీరాజ్‌తో పాటు యూనిట్ సభ్యులందరూ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.
ఇటీవల పృథ్వీరాజ్‌కు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా ఫలితం వచ్చింది. అయితే, యూనిట్ మొత్తానికి క్లీన్ చిట్ లభిస్తుందని అందరూ భావించారు. కానీ, యాభై ఎనిమిదేళ్ల వయసున్న ఓ యూనిట్ మెంబర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంలో చిత్రబృందం షాక్‌లో మునిగిపోయింది. క్వారంటైన్‌లో ఉన్న అతడిని ప్రభుత్వ అధికారులు ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ఇటీవల కేరళలో కేసులు తగ్గాయి. ప్రజలు ఊపిరి తీసుకుంటున్నారు. సినిమా యూనిట్‌లో ఒకరికి కరోనా రావడంతో టీమ్ అందరూ టెన్షన్ పడుతున్నారు.
![]() |
![]() |