![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. 'భారతీయుడు 2' పూర్తి చేశాకే శంకర్ ఈ సినిమా చేయాలని ఇప్పటికే ఆ చిత్రనిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక తాజాగా రామ్ చరణ్ సినిమా కోసం తయారు చేసిన కథ తనదేనంటూ ఓ రచయిత దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది.
శంకర్ 'ఆర్‌సీ 15'కి కథ తయారు చేసి ఇవ్వమని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుని కోరగా.. ఆయన ఓ కథ తయారు చేసి ఇచ్చారట. అయితే ఆ కథ తనదని కార్తీక్ సుబ్బరాజ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చెల్లముత్తు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆయన ఆశ్రయించారు. కార్తీక్, చెల్లముత్తులతో మాట్లాడి ఈ వివాదంపై రచయితల సంఘం త్వరలో తీర్పు వెల్లడిస్తుందని కోలీవుడ్ టాక్.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వరుస వివాదాలు వెంటాడుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
![]() |
![]() |