Home  »  News  »  నేషనల్ అవార్డ్స్ లో కమిటీ కుర్రోళ్లు సంచలనం.. ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు మరిన్ని..

Updated : Jul 18, 2026

 

 

మేకర్ తో పాటు ప్రతి ఆర్టిస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ స్థాయి అవార్డుని  అందుకోవాలని ఎంతో ఆశపడతాడు. తద్వారా వాళ్ళ సినీ ప్రాభవానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఆ గుర్తింపుని 'కమిటీ కుర్రోళ్లు' దక్కించుకుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న కమిటీ కుర్రోళ్లు ప్రతిష్ఠాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో 2024 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఎంతోమంది హేమాహేమీల చిత్రాలని దాటుకుని ఈ చిన్న సినిమా అగ్రస్థానంలో నిలవడం టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రగా మారింది. గ్రామీణ నేపథ్యం, స్వచ్ఛమైన స్నేహం, భావోద్వేగాలు, మనుషుల మధ్య ఉండే సున్నితమైన సంబంధాలని ఎంతో సహజంగా తెరకెక్కించిన విధానం జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులని  ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సాధించిన ఘనత వెనుక ఒక బలమైన కథనం మరియు ఎంతోమంది  శ్రమ దాగి ఉంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించగా, యదు వంశీ  దర్శకుడిగా పరిచయమయ్యాడు.  కేవలం 9 కోట్ల రూపాయల  బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, గతంలో ఆగస్టు 9, 2024న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. థియేట్రికల్ పరంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 18.5 కోట్ల రూపాయల వసూళ్లని  సాధించడమే కాకుండా, నాన్, థియేట్రికల్ రెవెన్యూ రూపంలో మరో 6 కోట్ల రూపాయలను  రాబట్టింది. ఈ విధంగా మొత్తంగా 24.5 కోట్ల రూపాయల  భారీ కలెక్షన్లతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Also read: ఒకే ఒక్క హిట్ తో 30 లక్షల నుంచి 3 కోట్ల వరకు!


ఏది ఏమైనా  ఒక వైపు భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు పోటీ పడుతున్న తరుణంలో, కొత్త నటీనటులతో, ఎటువంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని కైవసం చేసుకోవడం విశేషం.ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ కోటాలో కూడా కమిటీ కుర్రాళ్ళు నుంచి పి. రవికుమార్ నేషనల్ అవార్డు అందుకోనున్నాడు. 


committee kurrollu, 72nd National Film Awards






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.