Home  »  News  »  72వ జాతీయ చలనచిత్ర అవార్డులు: తెలుగు సినిమాలకు దక్కిన పురస్కారాలివే!

Updated : Jul 18, 2026

ప్రతిష్ఠాత్మక 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటన వెలువడింది. ఈసారి టాలీవుడ్ సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు వివిధ కేటగిరిల్లో జాతీయ అవార్డులను కైవసం చేసుకుని తెలుగు సినిమా సత్తాను చాటారు. ముఖ్యంగా కల్కి 2898 ఏడీ, పుష్ప-2, కమిటీ కుర్రోళ్లు, 35 చిన్న కథ కాదు, లక్కీ భాస్కర్ చిత్రాలు అవార్డుల పంట పండించాయి.

తెలుగు సినిమాలకు దక్కిన తొమ్మిది కేటగిరిల అవార్డుల వివరాలు:

ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: కమిటీ కుర్రోళ్లు

ఉత్తమ పాపులర్ చిత్రం (హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్): కల్కి 2898 ఏడీ

ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు

ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌ (ఒరిజనల్‌): సుకుమార్‌ (పుష్ప-2)

బెస్ట్ డైలాగ్ రైటర్‌: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలి నూర్‌, శీతల్ శర్మ (పుష్ప-2)

బెస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ డిజైనర్‌: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్: పి.రవికుమార్‌ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ బాల నటుడు: అరుణ్‌ దేవ్ (35 చిన్న కథ కాదు)

ఇతర ప్రధాన కేటగిరిల విజేతలు:

ప్రధాన అవార్డులు:

ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370

ఉత్తమ నటుడు: మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్‌ (సంయుక్తంగా)

ఉత్తమ నటి: యామీ గౌతమ్‌ (ఆర్టికల్ 370)

ఉత్తమ దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియస్వామి (అమరన్‌)


సాంకేతిక విభాగం:

ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌: జీవీ ప్రకాశ్ కుమార్‌ (అమరన్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): శశ్వంత్ సచ్‌దేవ్‌ (ఆర్టికల్ 370)

ఉత్తమ పాటల రచయిత: మనోజ్‌ ముంతాసిర్ (మైదాన్‌)

బెస్ట్ సినిమాటోగ్రఫర్: జలాల్‌ (భ్రమయుగం)

బెస్ట్ ఎడిటర్: కలైవన్నన్‌ (అమరన్)

బెస్ట్ సౌండ్ డిజైనర్‌: మానస్ చౌదరి (భూల్ బులియా)

బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌: యోగేశ్ దేశ్‌పాండే

భాషల వారీగా ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు:

ఉత్తమ తమిళ చిత్రం: రాయన్

ఉత్తమ మలయాళ చిత్రం: ఫెమినిస్ట్ ఫాతిమా

ఉత్తమ కన్నడ చిత్రం: మిథ్య (ఇల్యూజన్‌)

ఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్

ఉత్తమ గుజరాత్‌ చిత్రం: మారన్ (ద హంట్‌)

ఉత్తమ బెంగాలీ చిత్రం: చల్‌చిత్ర ఎఖో

ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం: కెప్టెన్‌ మిల్లర్‌ (తమిళం)

స్పెష‌ల్ మెన్ష‌న్‌ & ఇతర అవార్డులు:

స్పెషల్ మెన్షన్‌: మేయళగన్‌ (తమిళం), కెప్టెన్ మిల్లర్ (ధనుష్)

బెస్ట్ ఫిల్మ్‌ క్రిటిక్‌: సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)

సినిమాలపై ఉత్తమ పుస్తక రచయిత: ప్రదీప్‌కుమార్ శెట్టి (కన్నడ)

నాన్-ఫీచర్ ఫిల్మ్ కేటగిరి:

బెస్ట్ డాక్యుమెంటరీ: రామ్‌ నమీ

బెస్ట్ డైరెక్షన్‌: ఆనంద్‌ రాయ్‌ (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ)

బెస్ట్ సినిమాటోగ్రఫీ: లైవ్‌ ఇన్ లూమ్‌

బెస్ట్ స్క్రిప్ట్‌: ఓబుర్‌

స్పెషల్‌ మెన్షన్‌: ద చోలా డోరా ఔర్‌ సూయి, భద్రకాళి నాటకం






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.