Home  »  News  »  బిగ్ రిస్క్ లో బాలయ్య!

Updated : Jul 18, 2026

 

సంక్రాంతి పండుగకి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)సినిమా చూస్తే వచ్చే మజా వేరని అభిమానుల నమ్మకం. మెజారిటీ సినీ ప్రేమికులు, ప్రేక్షకులు కూడా ఆ మాటకి ఏకీభవిస్తారు. స్వయానా బాలకృష్ణకి కూడా సంక్రాంతికి తన సినిమా రిలీజ్ చెయ్యడం  సెంటిమెంట్. ఏదో ఒకటి రెండు సార్లు మినహా సంక్రాంతి  పండుగ బరిలో నిలిచిన ప్రతిసారీ బ్లాక్ బస్టర్ హిట్లతో రికార్డుల వేట సాగించాడు.


ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కొత్త మూవీ చేస్తున్నాడు. బాలయ్య, గోపీచంద్ కాంబోలో వీరసింహా రెడ్డి తర్వాత వస్తున్న మూవీ కావడంతో  అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు డిసెంబర్ లేదా సంక్రాంతి రేసులో నిలపాలని గట్టిగా భావిస్తున్నారు. అయితే, సంక్రాంతి బరిలోకి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తీసుకురావాలనే ఆలోచన ఇప్పుడు బాలయ్యకు ఒక పెద్ద సవాలుగా, సరికొత్త రిస్క్‌గా మారిందని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది..ఈ సవాలుకి ప్రధాన కారణం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అని విశ్లేషకులు చెబుతున్నారు. టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటే అనిల్ రావిపూడికి ఒక బలమైన హోల్డ్ ఉంది. ఇప్పటికే ఎఫ్2, ఎఫ్ 3 , సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం. మన శంకర వరప్రసాద్ గారు  వంటి వరుస హిట్లతో పండుగ విన్నర్‌గా నిలుస్తూ వస్తున్నాడు. రాబోయే సంక్రాంతి బరిలోనూ విక్టరీ వెంకటేష్ ళ్యాణ్ రామ్ కాంబినేషన్ చిత్రంతో వస్తున్నాడు. గతంలో సంక్రాంతి రేసులో అనిల్ రావిపూడి సినిమాలతో పోటీపడిన రెండు సందర్భాల్లోనూ బాలకృష్ణ సినిమాలకి గట్టి దెబ్బ తగిలింది. 'ఎఫ్2' మూవీకి పోటీగా వచ్చిన బాలయ్య 'కథానాయకుడు' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సాధారణంగా పండుగ సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్‌  కనెక్ట్ చేసే వినోదాత్మక చిత్రాలే భారీ వసూళ్లు సాధిస్తుంటాయి, ఆ విషయంలో అనిల్ రావిపూడి ఎక్స్‌పర్ట్ కావడమే దీనికి కారణం. సంక్రాంతికే వచ్చిన 'డాకు మహారాజ్' చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా హవాని  తట్టుకోలేకపోయింది. 

Also read: షాక్ లో అక్కినేని ఫ్యాన్స్!

ఆ సమయంలో డాకు మహారాజ్ నాలుగు రోజుల ముందే థియేటర్లలోకి రావడం వల్ల బ్రేక్ ఈవెన్ సాధించి సేఫ్ జోన్‌లోకి వెళ్ళగలిగింది కానీ, ఒకే రోజు గనుక పోటీ పడి ఉంటే గట్టెక్కడం చాలా కష్టమయ్యేదని ట్రేడ్ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమో అన్న ఆందోళన అభిమానుల్లో ఉంది. కేవలం అనిల్ రావిపూడి మాత్రమే కాదు, ఈ సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కూడా పోటీకి సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతికి ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మరి ఈ ట్రిపుల్ కాంబో బాక్స్ ఆఫీస్ వార్ లో నటసింహం తన సెంటిమెంట్‌  కాపాడుకుని విజేతగా నిలుస్తారో లేదో చూడాలి!   

balakrishna, nbk111, chiranjeevi, anilravipudi, venkatesh, kalyan ram






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.