![]() |
![]() |

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)కోడలు, గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)సతీమణి 'ఉపాసన కొణిదెల'(upasana Konidela)గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చాలా సంవత్సరాల నుంచి సామాజిక బాధ్యతతో పాటు, జంతు ప్రేమికురాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 'ఉపాసన' ని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ హబ్(Telangana Sports Hub)కి కో చైర్ పర్సన్ గా నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయంపై చిరంజీవి స్పందిస్తు 'మా కోడలు ఉపాసన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కి కో చైర్ పర్సన్. గౌరవనీయమైన పదవిలో తనని నియమించడం చాలా సంతోషంగా ఉంది. గౌరవం కంటే బాధ్యతని మరింత పెంచిందని చెప్పాలి. డియర్ ఉపాసన మీకున్న నిబద్ధత, ఫ్యాషన్ తో క్రీడల్లో దాగి ఉన్న అపార ప్రతిభని గుర్తించి ప్రోత్సహిస్తారని, ప్రతిభావంతులని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి తగిన విధి విధానాలు రూపొందించడంలో నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నాను. నీ ప్రయాణంలో ఆ దేవుడు దీవెనలు తప్పకుండా ఉంటాయని ట్వీట్ చేసాడు.
లండన్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్ మెంట్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన ఉపాసన, చాలా సంవత్సరాల నుంచి మహిళలు తమ సొంతంగా వ్యాపారం చేసుకొని నిలదొక్కుకునేలా సలహాలు ఇస్తు ఉంది. .తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండ(Domakonda)ఉపాసన స్వస్థలం. తండ్రి అనిల్ కామినేని, శోభన సుదీర్ఘ కాలం నుంచి వ్యాపార రంగంలో రాణిస్తు వస్తున్నారు.

![]() |
![]() |