![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను లిక్కర్ స్కాం ఊపేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం మధ్య కుంభకోణానికి పాల్పడి, వేల కోట్లు దోచుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశముంది. (AP liquor scam)
ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు కీలకంగా మారాడు. కోట్ల విలువైన నోట్ల కట్టలతో వెంకటేష్ ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి సమయంలో అతనితో హీరోయిన్ తమన్నా ఉన్న ఫొటోలు దర్శనమివ్వడం కొత్త చర్చకు దారి తీసింది. (Tamannaah Bhatia)
వెంకటేష్ నాయుడుతో కలిసి ప్రైవేట్ జెట్ లో పయనిస్తున్న తమన్నా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వెంకటేష్, తమన్నాకు సంబంధం ఏంటి అనే చర్చ మొదలైంది. వీరు అనుకోకుండా కలిశారా? లేక ముందే పరిచయముందా? వంటి విషయాలు తెలియాల్సి ఉంది. మరి ఈ అంశంపై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి.
![]() |
![]() |