![]() |
![]() |

నిన్న'కేంద్రప్రభుత్వం'(Central Government)అత్యంత ప్రతిష్టాత్మకమైన '71వ జాతీయ అవార్డులని'(71st national film awards)ప్రకటించిన విషయం తెలిసిందే. 2023 వ సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులలో తెలుగు సినిమా వివిధ కేటగిరీల్లో ఏడు అవార్డులు దక్కించుకుంది. దీంతో తెలుగు సినిమా సత్తాని జాతీయ స్థాయిలో చాటినట్లయింది. ముఖ్యంగా ఉత్తమ తెలుగు చిత్రంగా 'గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)వన్ మాన్ షో 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari)ఎంపిక కావడం పట్ల నందమూరి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రీసెంట్ గా జాతీయ అవార్డ్స్ పై 'మెగాస్టార్ చిరంజీవి'(Chiranjeevi)స్పందిస్తు 71 వ జాతీయ అవార్డు విజేతలకి నా హృదయ పూర్వక అభినందనలు. ఈ పురస్కారాల్లో మన తెలుగు సినిమా మరోసారి మెరిసిందంటూ ట్వీట్ చెయ్యడం జరిగింది. అవార్డు లిస్ట్ లని చూసుకుంటే తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘బలగం(Balagam)చిత్రంలోని 'ఊరూ, పల్లెటూరు' గేయాన్ని రచించిన కాసర్ల శ్యామ్(Shyam Kasarla)ఉత్తమ గేయ రచయితగా నిలవగా, ఉత్తమ ఎవిజిసి అవార్డు(యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్)తోపాటు ఉత్తమ యాక్షన్ డైరెక్టర్స్‌గా నందు(Nadhu)పృథ్వి(Prithvi)లు హనుమాన్(Hanuman)మూవీకి ఎంపికయ్యారు. ‘బేబీ'(Baby)చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో సాయిరాజేష్(Sairajesh) తో పాటు, ఉత్తమ నేపథ్యగాయకుడిగా ‘ప్రేమిస్తున్నా..’పాటని ఆలపించిన పి.వి.ఎన్.ఎస్.రోహిత్(Pvns Rohith)కి అవార్డు లభించింది.
'గాంధీతాత చెట్టు' (Gandhi Tatha Chettu)చిత్రంలో ఉత్తమ నటన ప్రదర్శించిన ప్రముఖ అగ్ర దర్శకుడు సుకుమార్(Sukumar)కుమార్తె 'సుకృతివేణి'(Sukriti Veni) ఉత్తమ బాలనటిగా ఎంపికయ్యారు. ఇక జవాన్(Jawan)చిత్రంలో అత్యుతమ నటన కనపర్చిన బాలీవుడ్ బాద్షా ' షారుక్ ఖాన్'(Shah Rukh Khan)ఉత్తమ నటుడుగా నిలిచాడు. ముప్పై మూడు సంవత్సరాల షారుక్ నట జీవితంలో తొలి జాతీయ పురస్కారాన్ని అందుకోబోతుండటం విశేషం.
.webp)
![]() |
![]() |