![]() |
![]() |

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)తన ప్రీవియస్ మూవీ 'హరిహరవీరమల్లు'(HariHara Veeramallu)తో అభిమానులని,ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి దృష్టి అప్ కమింగ్ మూవీ 'ఓజి'(Og)పై ఉంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'ఆర్ఆర్ఆర్'(RRR)నిర్మాత 'దానయ్య'(Dvv Danayya)నిర్మిస్తుండగా . 'సాహూ' మూవీ ఫేమ్ సుజిత్(Sujeeth)దర్శకుడు. పవన్ సరసన ప్రియాంక మోహన్(Priyanka MOhan)జత కడుతుండగా ఇమ్రాన్ హష్మీ, శ్రీయరెడ్డి, 'అర్జున్ దాస్' కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth),నాగార్జున(Nagarjuna),దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj)కాంబోలో తెరకెక్కిన 'కూలీ'(Coolie)పై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ బిగ్ హీరో అమీర్ ఖాన్(Amirkhan)కూడా ఒక స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు. అగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ మూవీ ఆగస్ట్ 13న యుఎస్ లో గ్రాండ్ ప్రీమియర్స్ కి సిద్ధం అయ్యింది. ఈ ప్రీమియర్స్ లో కూలీ ప్రింట్ తో పాటు ఓజి స్పెషల్ గ్లింప్స్ ని కూడా అటాచ్ చేసి విడుదల చేస్తున్నారనే టాక్ వినపడుతుంది. మేకర్స్ అయితే ఈ విషయంలో అధికార ప్రకటన ఇవ్వలేదు.
ఓజి నుంచి రేపు ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. సంగీత దర్శకుడు థమన్(Taman)చాలా ఇంటర్వ్యూలలో ఓ జి సాంగ్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయని చెప్పిన నేపథ్యంలో రేపు విడుదల కానున్న సాంగ్ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉంది. 'ఓజి' నుంచి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ తో పాటు,టీజర్ రిలీజై సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

![]() |
![]() |