![]() |
![]() |

71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల్లో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'భగవంత్ కేసరి' సత్తా చాటింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అలాగే 'హనుమాన్', 'బేబీ' వంటి తెలుగు సినిమాలు కూడా సత్తా చాటాయి. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ ఫిల్మ్ (విజువల్ ఎఫెక్ట్స్) విభాగాల్లో హనుమాన్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో బేబీ అవార్డులు గెలుపొందాయి. బలగంలోని ఊరు పల్లెటూరు పాటకు ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్ అవార్డు గెలుచుకున్నారు.
2023 ఏడాది గాను ఉత్తమ జాతీయ నటుడు విభాగంలో ఇద్దరు ఎంపికయ్యారు. జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ చిత్రానికి విక్రాంత్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుపొందారు. ది కేరళ స్టోరీ సినిమాకి గాను సుదీప్తో సేన్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ ఎంపికైంది.
71st National Awards
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: 12th ఫెయిల్
బెస్ట్ యాక్టర్: షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మెస్సీ (12th ఫెయిల్)
బెస్ట్ యాక్టర్ ఫిమేల్: రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
బెస్ట్ డైరెక్టర్: కేరళ స్టోరీ, సుదీప్తో సేన్
బెస్ట్ ఫిల్మ్: యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్: హనుమాన్
బెస్ట్ చిల్డ్రన్ సినిమా: నాల్ 2 (మరాఠీ)
బెస్ట్ ఫీచర్ పిల్మ్ ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్: స్యామ్ బహద్దూర్
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ హోల్ సమ్ ఎంటర్‌టైన్మెంట్స్: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ
బెస్ట్ డెబ్యూ ఫిల్మ్: ఆత్మ పామ్ప్లేట్
బెస్ట్ తెలుగు ఫిల్మ్: భగవంత్ కేసరి
బెస్ట్ తమిళ్ ఫిల్మ్: పార్కింగ్
బెస్ట్ పంజాబి ఫిల్మ్: గోడే గోడే ఛా
బెస్ట్ ఒడియా ఫిల్మ్: పుష్కరా
బెస్ట్ మరాఠీ ఫిల్మ్: శ్యామ్చి ఆయ్
బెస్ట్ మలయాళం ఫిల్మ్: ఉల్లుజు
బెస్ట్ కన్నడ ఫిల్మ్: ది రే ఆఫ్ హోప్
బెస్ట్ హిందీ ఫిల్మ్: కఠల్: ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ
బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: వష్ హైఫ్నోసిస్
బెస్ట్ బెంగాలి ఫిల్మ్: దీప్ ఫ్రిడ్జ్
బెస్ట్ అస్సామి ఫిల్మ్: రొంగటపు 1982
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: నందు పృథ్వీ (హనుమాన్ )
బెస్ట్ కొరియోగ్రఫీ: ధింధోర బజే రే, వైభవి మర్చంట్
బెస్ట్ లిరిక్స్: కాసర్ల శ్యామ్ (బలగం - ఊరు పల్లెటూరు)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్ఠర్: సాంగ్స్ జివి ప్రకాశ్ కుమార్ (వాతి ), బ్యాగ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
బెస్ట్ సౌండ్ డిజైనింగ్: సచిన్ సుధాకరన్ అండ్ హరిహరన్ మురళీధరన్ (యానిమల్ )
బెస్ట్ స్క్రీన్ ప్లే: సాయి రాజేష్ (బేబీ), రామ్ కుమార్ బాలకృష్ణన్ (పార్కింగ్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: ప్రశాంతను మోహపాత్ర (కేరళ స్టోరీ)
బెస్ట్ ఫీమేల్ సింగర్: శిల్పా రావు (జవాన్- చెలియా)
బెస్ట్ మేల్ సింగర్: రోహిత్ విపిఎస్ఎన్ (బేబీ - ప్రేమిస్తున్నా)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతి వేణి బండ్రెడ్డి(గాంధీ తాత చెట్టు), కబీర్ ఖాన్దారే (గిప్సీ - మరాఠీ), త్రీషా తోసర్, శ్రీనివాస్ పోకలే అండ్ భార్గవ్ జాగ్తాప్ (నాల్ 2 - మరాఠీ)
![]() |
![]() |