![]() |
![]() |

సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)ఈ నెల 14 న 'కూలీ'(Coolie)తో వచ్చి తన కెరీర్ లో మరోసారి రికార్డు కలెక్షన్స్ ని వసూలు చేసాడు. చిత్ర బృందం అయితే ఇప్పటికే 500 కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసినట్టు అధికారంగా ప్రకటించింది. ఈ మూవీలో రజనీకాంత్ ప్రాణ స్నేహితుడు క్యారక్టర్ లో అద్భుతంగా నటించి మరోసారి ప్రేక్షకులని మెప్పించాడు వర్సటైల్ నటుడు 'సత్యరాజ్'. ఒక రకంగా చెప్పాలంటే 'కూలీ' కథ మొత్తం 'సత్యరాజ్(Sathyaraj)చేసిన రాజశేఖర్ క్యారక్టర్ చుట్టూనే తిరుగుతుంది.
రీసెంట్ గా సత్యరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు రజనీకాంత్, శంకర్(Shankar)కాంబినేషన్ లో వచ్చిన 'శివాజీ'(Shivaji)సినిమాలో విలన్ క్యారక్టర్ కి మొదట నన్నే అడిగారు. కానీ నేను చెయ్యనని చెప్పాను. నాకు అప్పుడప్పుడే హీరోగా మంచి అవకాశాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో నెగిటివ్ రోల్ చేస్తే ఇక అన్ని అలాంటి అవకాశాలే వస్తాయని చెయ్యలేదు. కానీ నాకు రజనీకాంత్ సినిమాలో నటించడం ఇష్టం లేకనే శివాజీలో చేయలేదనే వ్యాఖ్యలు మీడియాలో సైతం వచ్చాయి. కానీ వాటిల్లో నిజం లేదని సత్యరాజ్ చెప్పుకొచ్చాడు.
సత్యరాజ్ చెప్పినట్టుగానే రజనీకాంత్ పక్కన ఎంత కష్టపడి చేసినా, తన స్టైల్, మేనరిజమ్స్ తో రజనీకాంత్ కే పేరు వస్తుందని, అందుకే శివాజీ లో చెయ్యనని సత్యరాజ్ చెప్పాడనే మాటలు తమిళ సినీ సర్కిల్స్ లో జోరుగానే వినిపించాయి. ఇప్పుడు సత్యరాజ్ చెప్పిన విషయంతో అలాంటి పుకార్లకి చెక్ పెట్టినట్లయింది. ఇక సత్య రాజ్ చెయ్యాల్సిన క్యారక్టర్ లో 'సుమన్'(Suman)చేసి తన నటనతో మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. శివాజీ విజయం మరింత పెరగడానికి కూడా భాగమయ్యాడు. 2007 వ సంవత్సరంలో 'శివాజీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
.webp)
![]() |
![]() |