![]() |
![]() |

`మల్లీశ్వరి` (2004) చిత్రంలో విక్టరీ వెంకటేశ్ పోషించిన `పెళ్ళి కాని ప్రసాద్` పాత్ర ఎంతగా ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాకి ముందు, తరువాత వెంకీ ఈ తరహా వేషాల్లో కనిపించినప్పటికీ.. `పెళ్ళి కాని ప్రసాద్` పాత్ర తెచ్చిన గుర్తింపే వేరు.
కట్ చేస్తే.. ఇప్పుడీ తరహాలోనే సాగే ఫుల్ కామిక్ రోల్ ఒకటి రెడీ అవుతుందోట. అయితే, ఆ పాత్రని వెంకీ చేయడం లేదు. `సంక్రాంతి`, `లక్ష్మీ` చిత్రాల్లో వెంకటేశ్ కి తమ్ముడిగా నటించిన శర్వానంద్ చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. `నేను శైలజ` ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా `ఆడాళ్ళూ మీకు జోహార్లు` పేరుతో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులోనే శర్వా.. నయా `పెళ్ళి కాని ప్రసాద్` పాత్రలో దర్శనమివ్వబోతున్నాడట. హిలేరియస్ గా సాగే ఈ రోల్.. శర్వాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని టాక్.
కాగా `ఆడాళ్ళూ మీకు జోహార్లు` కంటే ముందు `మహా సముద్రం`తో పలకరించనున్నాడు శర్వానంద్. సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్న ఈ అజయ్ భూపతి డైరెక్టోరియల్.. ఆగస్టు 19న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |