![]() |
![]() |

జూలై నెలలో పలు ఆసక్తికరమైన చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. గమ్మత్తేమిటంటే.. కొంతకాలం క్రితం జోడీగా సందడి చేసిన కొన్ని జంటలు.. ఈ జూలైలో ఒకే వారంలో బాక్సాఫీస్ ముంగిట `ఢీ` కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
రామ్ వర్సెస్ తమన్నాః
2012లో విడుదలైన `ఎందుకంటే ప్రేమంట`లో జంటగా ఎంటర్టైన్ చేశారు రామ్, తమన్నా. కట్ చేస్తే.. ఈ జోడీ జూలై రెండో వారంలో బాక్సాఫీస్ వార్ కి సిద్ధమయ్యారు. జూలై 14న రామ్ `ద వారియర్` రిలీజ్ కానుండగా.. జూలై 15న తమన్నా `గుర్తుందా శీతాకాలం` విడుదలకు సిద్ధమైంది.
నాగచైతన్య వర్సెస్ అనుపమః
`ప్రేమమ్` (2016)లో జంటగా కనువిందు చేసిన నాగచైతన్య, అనుపమ పరమేశ్వరన్.. జూలై 22న బాక్సాఫీస్ పోటీకి సిద్ధమయ్యారు. ఆ రోజు చైతూ `థాంక్ యూ` రిలీజ్ కానుండగా.. `కార్తికేయ 2`తో అనుపమ ఎంటర్టైన్ చేయనుంది.
నిఖిల్ వర్సెస్ అవికా గోర్ః
`ఎక్కడికి పోతావు చిన్నవాడా` (2016)లో కలిసి నటించిన నిఖిల్, అవికా గోర్.. జూలై 22న వేర్వేరు సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. `కార్తికేయ 2`తో నిఖిల్ జూలై 22న పలకరించనుండగా.. అదే రోజు `థాంక్ యూ`తో వినోదాలు పంచనుంది అవికా గోర్.
రవితేజ వర్సెస్ మీనాక్షి చౌదరిః
ఈ ఏడాది ఆరంభంలో `ఖిలాడి` కోసం ఆడిపాడిన రవితేజ, మీనాక్షి చౌదరి.. జూలై 29న వేర్వేరు చిత్రాలతో సందడి చేయనున్నారు. `రామారావు ఆన్ డ్యూటీ` అంటూ ఆ రోజు రవితేజ ఎంటర్టైన్ చేయనుండగా.. `హిట్ః ద సెకండ్ కేస్`తో మీనాక్షి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
![]() |
![]() |