![]() |
![]() |

`చెక్`, `రంగ్ దే`, `మాస్ట్రో`.. ఇలా ఇటీవల కాలంలో యూత్ స్టార్ నితిన్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే `మాచర్ల నియోజక వర్గం`పైనే ఆశలు పెట్టుకున్నాడు నితిన్. నూతన దర్శకుడు ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో నితిన్ కి జోడీగా కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఆగస్టు 12న విడుదలకు సిద్ధమైంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు ఆగస్టు నెలలో విడుదలైన నితిన్ సినిమాలన్నీ తీవ్ర నిరాశపరిచాయి. 2009లో ఆగస్టు 7న విడుదలైన నితిన్ `అగ్యాత్` (తెలుగులో `అడవి`) డిజాస్టర్ గా నిలవగా.. 2017లో ఆగస్టు 11న భారీ అంచనాల నడుమ జనం ముందుకు వచ్చిన `లై` కూడా అదే బాట పట్టింది. అదేవిధంగా, 2018 ఆగస్టు 9న విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ `శ్రీనివాస కళ్యాణం` కూడా డిజప్పాయింట్ చేసింది. మరి.. ఇప్పటివరకు అస్సలు అచ్చిరాని ఆగస్టులో మరో ప్రయత్నం చేస్తున్న నితిన్.. నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి మరి విజయాన్ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి. కాగా, `మాచర్ల నియోజక వర్గం`ని నితిన్ హోమ్ బేనర్ శ్రేష్ఠ్ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
![]() |
![]() |